: అమెరికన్ కాంగ్రెస్ లో మోడీ ప్రసంగం ఉండకపోవచ్చు


అమెరికా ప్రతినిధుల సభ (కాంగ్రెస్)లో మోడీ ప్రసంగిస్తారా? లేదా? అనే విషయంపై పెద్ద చర్చే కొనసాగుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్) ఆఖరులో అమెరికా పర్యటనకు మోడీ వెళుతున్నారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. సెప్టెంబర్ చివర్లోనే మోడీ పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో మోడీ ప్రసంగించేలా పలువురు అమెరికన్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ లో మోడీ ప్రసంగం ఉండకపోవచ్చని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. "నవంబరులో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ప్రచారం కోసం తమ నియోజకవర్గాలకు వెళ్లాలని సభ్యులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, ప్రతినిధుల సభలో మోడీ ప్రసంగం ఉండకపోవచ్చు" అంటూ విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News