: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ 81వ జయంతి నేడు
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను టీఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని వ్యవసాయ వర్శిటీలో జయంతి వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాన్ని ఆచార్య జయశంకర్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.