: టైగర్ ప్రభాకరన్ కుమారుడిపై సినిమా వస్తోంది!
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చిన్న కుమారుడైన బాలచంద్రన్ పై సినిమా వస్తోంది. ‘పులిపారవై’ పేరుతో తమిళ దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలంక సైన్యంతో యుద్ధం చేస్తున్న సమయంలో 12 ఏళ్ల బాలచంద్రన్ సైన్యానికి దొరికిపోయాడు. అతనిని సైన్యం కాల్చి చంపిందని ఆ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అప్పట్లో నిరసనను వ్యక్తం చేశాయి. ఇక, ఇప్పుడు బాలచంద్రన్ ను పోరాట యోధుడుగా పేర్కొంటూ ఈ సినిమా నిర్మితమవుతోంది.