: అసెంబ్లీ భవనాల కేటాయింపుపై వివాదాల్లేవ్: స్పీకర్ కోడెల
హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభా స్పీకర్ల సమావేశం ముగిసింది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 13 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ... అసెంబ్లీ భవనాల కేటాయింపుపై అవగాహనకు వచ్చామని అన్నారు. మంత్రుల ఛాంబర్లు, పార్టీల కార్యాలయాలపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలేమీ లేవన్న కోడెల... అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహనకు వచ్చామని అన్నారు. సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.