: మూడేళ్ల వరకు విద్యుత్ సమస్య ఉంటుంది...రైతులే సర్దుకుపోవాలి: కేసీఆర్
మరో మూడేళ్ల వరకు విద్యుత్ సమస్య ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, మూడేళ్ల తరువాత రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. ఇంటింటికి తాగునీటి సౌకర్యం కోసం 25 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. పాలమూరులో 500 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు ప్రజాప్రతినిధులు నచ్చజెప్పాలని ఆయన సూచించారు.