: సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు పెరిగిపోతున్నాయ్!


వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు అనే నిబంధన కాగితాలకే పరిమితమవుతోంది. రోడ్లపై సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు మనకు సర్వసాధారణంగా కనిపిస్తారు. అయితే, కొన్నిసార్లు వారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఒకప్పుడు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడవి వందలు దాటి వేలల్లో నమోదవుతున్నాయి. గ్రేటర్ సిటిలో నెలకు 15 వేల కేసులు నమోదు అవుతున్నాయని పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. బైక్ పై వెళ్లేవారు, ఆటోడ్రైవర్లు ఎవరూ సెల్ డ్రైవింగ్ కి అతీతులు కారని తేలిపో్యింది. పోలీసులు కూడా సెల్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టారు. సెల్ డ్రైవింగ్ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు వారు కసరత్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనదారులు రెండోసారి పట్టుబడితే జైలుకు పంపాలని పోలీసులు యోచిస్తున్నారు. అయినా, ఇలాంటి విషయాల్లో మార్పు రావాలంటే ప్రజల్లో అవగాహన పెరిగాలి. కఠినమైన చట్టాలతో పాటు ప్రజల్లో అవగాహన కూడా ముఖ్యమే.

  • Loading...

More Telugu News