: తెలంగాణ రాష్ట్ర సర్కారుపై మంద కృష్ణ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సర్కారు పాలనపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్టంలో అధికార పక్షం ఉంది కానీ, ప్రతిపక్షం లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ విధానాలనే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అవలంబిస్తోందన్నారు. గోల్కొండ కోటలో జెండా ఎగురవేయడమంటే దొరలు తమ గడిలో స్వాతంత్ర్య జెండాను ఎగరేసినట్లేనన్నారు. కాగా, ఈ నెల 19న తెలంగాణలో చేసే సర్వేను వారం రోజులు పొడిగించాలని ఆయన కోరారు.