: 24.4 కోట్లలో రైతులకందకుండా 17.44 కోట్లు దోచుకున్నారు: సీఎం కు ఫిర్యాదు


విజయనగరం జిల్లాలోని జిందాల్ భూముల కుంభకోణంపై లోక్ సత్తా ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఫిర్యాదు చేశారు. జిందాల్ భూముల పరిహారం కింది రైతులకు అందజేయాల్సిన 24.4 కోట్ల రూపాయల్లో 17.44 కోట్ల రూపాయలను రాజకీయ దళారులు, రెవెన్యూ అధికారులు బొక్కేశారని ఆయన ఆరోపించారు. ఏసీబీ కూడా అవినీతిపరులతో కుమ్మక్కైందని ఆయన మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా పట్టించుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News