: జయలలితపై అభ్యంతరకర కథనంపై రాజపక్సే విచారం


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై శ్రీలంక రక్షణ శాఖ వెబ్ సైట్లో అభ్యంతరకర కథనంతో బాటు, ప్రధాని నరేంద్రమోడీ, జయ గ్రాఫిక్స్ ఫోటోలను కూడా పెట్టడంపై ఆ దేశ అధ్యక్షుడు మహిందా రాజపక్సే విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని కొలంబోలో విలేకరులకు తెలిపారు. 'హౌ మీనింగ్ ఫుల్ ఆర్ జయలలితాస్ లవ్ లెటర్స్ టు మోడీ?' అన్న శీర్షికతో లంక రక్షణ శాఖ వెబ్ సైట్ లో కథనం పెట్టారు. అనంతరం దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో వెంటనే కథనాన్ని, ఫోటోలను తొలగించి బేషరతు క్షమాపణలు కూడా చెప్పింది. అటు లంక వైఖరిపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News