: సింగపూర్ విమానాన్ని పక్షి ఆపేసింది


సింగపూర్ కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానాన్ని ఒక పక్షి ఆపేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి సింగపూర్ వెళ్లే టైగర్ ఎయిర్ వేస్ విమానం 167 మంది ప్రయాణికులతో టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొంది. దీంతో విమానం ఇంజిన్ పాక్షికంగా దెబ్బతింది. ఇంజిన్ లో సమస్య తలెత్తిందని గమనించిన పైలట్ విమానం టేకాఫ్ కాకుండా కంట్రోల్ రూంకి సమాచారమిచ్చి నిలిపేశారు. ప్రయాణికులందర్నీ విమానం నుంచి దించి హోటల్లో ఉంచిన సిబ్బంది, సాంకేతిక నిపుణుల్ని చెన్నై నుంచి రప్పించి మరమ్మతులు చేపట్టారు. సమస్య పరిష్కరించి ట్రైల్ రన్ నిర్వహించి ప్రయాణికులను ఎక్కించి పంపించారు.

  • Loading...

More Telugu News