: తన ప్రాణాలు అర్పించి తల్లి రుణం తీర్చుకున్న బుడతడు!


రెండు రోజుల కిందట ముజాహిద్ పూర్ అటవీప్రాంతంలో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైందనీ, పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారనీ వార్తా కథనాలు ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఆమె కొద్దిగా కోలుకోవడంతో ఇప్పుడు నిజానిజాలు వెలుగు చూశాయి. అమె అత్యాచారానికి గురికాలేదు. వివరాల్లోకి వెలితే...మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎల్కగూడెంకు చెందిన కిషోర్, షాద్ నగర్ కు చెందిన సుజాత ప్రేమించుకుని, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని హైదరాబాదులోని మల్కాజిగిరిలో కాపురం పెట్టారు. వీరికి బాబు పుట్టాడు, ఆ బుడతడికి మూడేళ్లు. అప్పటికీ తమ విషయం కిషోర్ తన తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో, సుజాత ఇంట్లో చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చేది. దీంతో ఇంటికి తీసుకెళ్తానని తమ్ముడు ఆనంద్ తో పాటు కిషోర్ భార్యబిడ్డలను తీసుకుని బయల్దేరాడు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ అటవీప్రాంతం చేరగానే మరిది ఆనంద్, భర్త కిషోర్ సూజాతపై దాడికి దిగారు. తల్లిని కొట్టడం చూసిన బాబు అడ్డురావడంతో వాడిని చంపేశారు. అలా పిల్లాడు తల్లిని కాపాడుకోలేకపోయినా తల్లికోసం ప్రాణమిచ్చి రుణం తీర్చుకున్నాడు. దీనిని అడ్డుకోబోయిన సుజాత గొంతు నులిమారు. స్పృహ తప్పిపడిపోయిన సుజాత మరణించిందని భావించి వారిద్దరూ వెళ్లిపోయారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సుజాతను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు విషయం వివరించారు. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కోలుకున్న ఆమె పోలీసులకు విషయం వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద్, కిషోర్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News