: సల్మాన్ నా సంపాదనకు దరిదాపుల్లో లేడు: శిల్పాశెట్టి భర్త


రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా... సల్మాన్ ఖాన్ మీద చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. బాలీవుడ్ లో నటుడిగా రాణించాలనుకుంటున్నారా? అని జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు రాజ్ కుంద్రా చెప్పిన సమాధానం ముంబై వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఒక సినిమాకి సంపాదించే మొత్తం కన్నా చాలా ఎక్కువ డబ్బును తాను కేవలం నెలలో సంపాదిస్తానని రాజ్ కుంద్రా గర్వంగా చెప్పాడు. బాలీవుడ్ లో టాప్ హీరో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు తాను బాలీవుడ్ లో ఎందుకు నటించాలనుకుంటానని కుంద్రా విలేకరులను ప్రశ్నించాడు. సంపాదన విషయంలో సల్మాన్ తనకు దరిదాపుల్లో కూడా లేడని కుంద్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని కావాలంటే సల్మాన్ ను అడిగి ఖరారు చేసుకోవచ్చని విలేకరులకు సూచించాడు. బాలీవుడ్ తనను భరించలేదని కూడా కుంద్రా వ్యాఖ్యానించాడు. కేవలం తన భార్య శిల్పాశెట్టి కోసమే తాను బాలీవుడ్ లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధపడ్డానని కుంద్రా అన్నాడు. కుంద్రా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సల్మాన్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సల్మాన్ అభిమానులు కుంద్రాపై తిట్ల దండకం మొదలు పెట్టారు. సల్మాన్ ఖాన్ కుంద్రా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడోనని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News