: సిండికేట్ బ్యాంకులో తనిఖీలు చేపట్టిన ఆర్ బీఐ
లంచం కేసులో ఇటీవల సిండికేట్ సీఎండీ ఎస్.కె.జైన్ అరెస్టయిన నేపథ్యంలో సదరు బ్యాంకు అకౌంటు పుస్తకాల్లో తనిఖీలు చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ రాజన్ ముంబయిలో మాట్లాడుతూ... సిండికేట్ బ్యాంకులో తనిఖీ జరుగుతుందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తీవ్రతర సమస్య మరిన్ని ఇబ్బందుల్లో పడేస్తుందని పేర్కొన్నారు.