: పరిశ్రమలకు ‘పవర్ కట్’ విధించయినా... రైతులకు ‘ఫుల్ పవర్’: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పూర్తి స్థాయిలో విద్యుత్తును అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకు అవసరమైతే పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పాటు విద్యుత్తు కోతలు విధిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం మహబూబ్ నగర్ లో 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.