: సమీక్షలు కాదు... సంక్షేమ పథకాలు కావాలి: పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సమీక్షలు కాదు... ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో బంద్ కు పిలుపునిచ్చి ఊరుకున్నారని ఆయన అన్నారు. తర్వాత పోలవరం అంశాన్ని పట్టించుకోనేలేదని పొన్నాల విమర్శించారు.