: గాజా సెగ బ్రిటన్ క్యాబినెట్ కు తాకింది!


గాజాపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానానికి తమ ప్రభుత్వం మద్దతిస్తుండడంతో బ్రిటన్ మంత్రి సయీదా వార్సి (43) రాజీనామా చేశారు. ప్రభుత్వ విధానాన్ని తాను అంగీకరించలేనని ఆమె తన రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు. 2010లో తొలిసారి మంత్రి పదవి చేపట్టిన వార్సి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న తొలి ముస్లింగా నిలిచారు. ఈమె విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగానూ, కామన్వెల్త్ వ్యవహారాల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందానని, ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజీనామా చేస్తున్నానని ప్రధానికి లేఖ రాశానని వార్సి వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. గాజా వ్యవహారంలో కాల్పుల విరమణకు పట్టుబడుతున్న బ్రిటీష్ ప్రభుత్వం ఇజ్రాయెల్ దమననీతిని ఎండగట్టడంలేదని ప్రధాని డేవిడ్ కామెరాన్ పై మరోపక్క ప్రతిపక్ష లేబర్ పార్టీ నిప్పులు చెరుగుతోంది.

  • Loading...

More Telugu News