: ‘మాసాయిపేట’ క్షతగాత్రుల్లో మరొకరు డిశ్చార్జి
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఇవాళ (మంగళవారం) మరొక బాలిక డిశ్చార్జి అయింది. నితీష్ అనే బాలిక కోలుకోవడంతో ఆసుపత్రి వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. అదే ఘటనలో గాయపడి యశోదాలో చికిత్స పొందుతున్న వారిలో శరత్, వరుణ్ గౌడ్, ప్రశాంత్ ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.