: అంధకారంలో ఉస్మానియా ఆసుపత్రి... నిలిచిపోయిన ఆపరేషన్లు
ఘనత వహించిన ఉస్మానియా ఆసుపత్రిలో గాఢాంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో... ఉదయం నుంచి ఆసుపత్రి చిమ్మచీకట్లో ఉంది. అత్యంత దారుణ విషయం ఏమిటంటే... కరెంట్ లేకపోవడంతో ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయి. కొన్ని వార్డులకు మాత్రం జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో పలు వార్డుల్లోని రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.