: రిజల్ట్ రాకుండానే గోల్డ్ మెడల్ ఇచ్చారు....ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సాక్షిగా దారుణమైన తప్పిదం జరిగింది. హైదరాబాదులో ఈ ఉదయం జరిగిన ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారో, లేక వారికి తెలిసే జరిగిందో కానీ, పరీక్ష ఫలితాలు రాకుండానే గోల్డ్ మెడల్స్ ప్రదానోత్సవం జరిగింది. పరీక్ష ఫలితాలు రాకుండా గోల్డ్ మెడల్ ఎలా ఇస్తారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు విజయవాడలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నాకు దిగనున్నారు. ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవకతవకలకు స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ ప్రదానం చేయడమే నిదర్శనమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.