: నల్గొండలో ఘనంగా ‘బంజారా తీజ్ సంబరాలు’
నల్గొండ పట్టణంలో బంజారాల తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గిరిజన మహిళలు మొలకల బుట్టలను తలపై పెట్టుకుని తరలివచ్చారు. వెదురు బుట్టల్లో మొలకలను పెంచి... వాటిని తలపై ఉంచుకుని ఆలయానికి తీసుకువస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గిరిజన మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులు ప్రదర్శించిన ఆటపాటా వీక్షకులను ఉత్సాహపరిచాయి.