: గ్రీన్ హౌస్ నిర్మాణాల కోసం ఆరుగురు సభ్యులతో కమిటీ
గ్రీన్ హౌస్ నిర్మాణాల కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఉద్యానవన శాఖ కమిషనర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. గ్రీన్ హౌస్ నిర్మాణాలకు సంబంధించిన సలహాలు, సూచనలను కమిటీ ప్రభుత్వానికి అందించనుంది. అలాగే ఏ ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ నిర్మాణాలు చేపట్టాలన్న దానిపై కూడా ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.