: 'వాకా' సెంచరీ నా కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్: సచిన్


పెర్త్ నగరంలోని 'వాకా' పిచ్ పై చేసిన సెంచరీ తన కెరీర్లోనే అత్యుత్తమైన ఇన్నింగ్స్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 1992లో వాకా పిచ్ పై చేసిన సెంచరీ తన కెరీర్ ను మలుపు తిప్పిందని సచిన్ పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్ పై... ప్రమాదకర ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం తనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సచిన్ అన్నాడు. వాకా లాంటి ప్రమాదకరమైన పిచ్ ను ప్రపంచంలో మరెక్కడా చూడలేమని... అక్కడ పరుగులు చేసినట్టయితే ప్రపంచంలో మరెక్కడైనా పరుగులు చేయవచ్చని తాను భావించానని సచిన్ అన్నాడు.

  • Loading...

More Telugu News