: అక్షయ్ కుమార్ భార్యకు బాంబే హైకోర్టులో ఊరట


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. రాజేష్ ఖన్నా నివసించిన బంగ్లాను ఆయన కుమార్తెలిద్దరూ ఇటీవల ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. దీంతో అనిత కోర్టుకెక్కారు. ట్వింకిల్ ఖన్నా తండ్రి, దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా రాయించిన వీలునామా కాపీని ఆయన సహచరి అనితా అద్వానీకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై బాంబే హైకోర్టు స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ట్వింకిల్ చేసిన అప్పీలును హైకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ మోహిత్ షా సారథ్యంలోని ధర్మాసనం ఈ కేసులో విచారణ ముగిసే వరకు గత తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అనితా అద్వానీ రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యురాలు లేదా వారసురాలు కాదని, ఆమెకు వీలునామా కాపీ ఇవ్వాల్సిన అవసరం ట్వింకిల్కు లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. రాజేష్ ఖన్నా తన వారసురాళ్లుగా కుమార్తెలు ట్వింకిల్, రింకీ పేర్లను వీలునామాలో రాశారని కోర్టుకు తెలిపారు. కాగా, నటి డింపుల్ కపాడియాతో విభేదించిన రాజేష్ ఖన్నా చివరివరకు వేరుగా అనితతో కలిసి ఉన్నారు.

  • Loading...

More Telugu News