: షారూఖ్ తో మిత్రత్వం కానీ శతృత్వం కానీ లేవు: అజయ్ దేవగణ్
అత్యాచారాలకు పాల్పడే వారిని చంపేయడం కంటే సమర్థవంతమైన శిక్ష మరొకటి లేదని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తెలిపారు. 'సింగమ్ రిటర్న్స్' ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా తనను వివాదంలోకి లాగేందుకే షారూఖ్ తో శతృత్వం క్రియేట్ చేసిందని అన్నాడు. షారూఖ్ తో తనకు మిత్రత్వం కానీ శతృత్వం కానీ లేవని ఆయన స్పష్టం చేశాడు. తామిద్దరం సహనటులమని, తమ మధ్య గౌరవభావం ఉందని అజయ్ దేవగణ్ తెలిపాడు.