: మాజీ మంత్రిపై పది సెక్షన్ల కింద కేసులు
మాజీ మంత్రి శంకర్రావును కేసులు వీడడం లేదు. గ్రీన్ ఫీల్డ్ భూముల్లో అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. గ్రీన్ ఫీల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిన మల్కాజిగిరి కోర్టు శంకర్రావు, ఆయన తమ్ముడు దయానంద్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో నేరేడ్ మెట్ పోలీసులు శంకర్రావు, దయానంద్ పై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.