: సికింద్రాబాదు-కాకినాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు వస్తున్నాయ్
సికింద్రాబాదు-కాకినాడ మధ్య 8 సూపర్ ఫాస్ట్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టనుంది. సెప్టెంబరు 7వ తేదీ నుంచి ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కొత్త రైళ్లు ఈ నెల 7, 9, 14, 16 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాదు నుంచి కాకినాడకు బయల్దేరుతాయి. అలాగే 8, 10, 15, 17 తేదీల్లో సాయంత్రం 6.15 గంటకు కాకినాడ-సికింద్రాబాదు రైళ్లు బయల్దేరుతాయి.