: నా ఆత్మ కథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్'కి సీక్వెల్ వస్తోంది: నట్వర్ సింగ్
సోనియా గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నది రాహుల్ గాంధీయేనంటూ తన ఆత్మ కథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్'లో పేర్కొని సంచలనం రేపిన కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ దీనికి సీక్వెల్ గా తన జీవితంలో సంభవించిన సంఘటనలతో మరో పుస్తకాన్ని తీసుకురానున్నానని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రియాంకాగాంధీ అభ్యర్థించారని తన జీవిత కథలో మార్పులు చేయలేదని అన్నారు. మరిన్ని ఆసక్తికర అంశాలతో 'మై ఇర్రెగ్యులర్ డైరీ' అనే పుస్తకాన్ని మార్చి నెలలో విడుదల చేస్తానని నట్వర్ సింగ్ తెలిపారు. అందులో రాజకీయాలు, గాంధీ కుటుంబ వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీని నడిపిన నాయకత్వంపై పలు ఆసక్తికర అంశాలు ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.