: బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో ఐదు రూపాయలకే భోజనం
సికింద్రాబాదు బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో నేడు 'సుభోజనం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మార్కెటింగ్ శాఖ ఐదు రూపాయలకే భోజనం అందించనుంది. ఈ ఉదయం బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, హరీశ్ రావు, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.