: ఏదో ఒకటి మాట్లాడడం కాదు... విద్యార్థుల భవిష్యత్ చూడండి: రావెల
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు ఎవరు మాట్లాడినా తమనేదో విమర్శిస్తున్నట్టుగా తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ సర్కారుకు సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... ‘మీ పిల్లలకు మీరు కట్టుకోండి, మా పిల్లలకు మేం కట్టుకుంటాం’ అని తెలంగాణ రాష్ట్ర నేతలు ఫీజు రీయింబర్స్ మెంట్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరపాలని విభజన చట్టంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కష్టంగా ఉంటే... జనాభా ప్రాతిపదికన ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేనిపోని వివాదాలు సృష్టిస్తోందని మంత్రి మండిపడ్డారు.