: 'టర్బోమేఘా' వివరాలను ఈ నెల 31న వెల్లడించనున్న రాంచరణ్


విమానయాన రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న మెగా హీరో రాంచరణ్ తన కంపెనీ 'టర్బోమేఘా'కు సంబంధించిన వివరాలను ఈ నెల 31న వెల్లడించనున్నారు. ఈ నెల 31న జరగనున్న ప్రెస్ మీట్ లో కంపెనీకి సంబంధించిన సేవలు, పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికలను రాంచరణ్ వివరిస్తారు. అలాగే, 'టర్బోమేఘా' లోగోను కూడా ఈ సమావేశంలో రాంచరణ్ ఆవిష్కరించనున్నారు. తీవ్రమైన పోటీ ఉండడంతో పాటు... బాగా నష్టాల్లో ఉన్న విమానయాన రంగంలోకి చరణ్ అడుగుపెట్టడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాంచరణ్ తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్ లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News