: శ్రీదేవిపై యువ హీరో సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి శ్రీదేవిపై బాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'శ్రీదేవి మా నాన్నకు భార్య అంతవరకే... అంతకు మించి మా మధ్య ఏ బంధమూ లేదు' అని స్పష్టం చేశాడు. శ్రీదేవితో తనకు సత్సంబంధాలు ఎన్నటికీ ఉండవని తేల్చి చెప్పాడు. ఎవరినీ అగౌరవ పరచకూడదని తన తల్లి మోనా కపూర్ చెప్పారని, అందుకే ఆమెను అగౌరవంగా చూడనని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. అలా అని శ్రీదేవి కుటుంబంతో ఎప్పటికీ సంతోషంగా గడపలేనని అర్జున్ కపూర్ తెలిపాడు. కాగా, శ్రీదేవి, అర్జున్ కపూర్ కు సవతి తల్లి అన్న విషయం తెలిసిందే.