: కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి: జ్వాల


బ్యాడ్మింటన్ క్రీడాంశంలో డబుల్స్ క్రీడాకారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని స్టార్ షట్లర్ గుత్తా జ్వాల ఆరోపించారు. దేశంలో సింగిల్స్ క్రీడాకారులకు ఎంతో గుర్తింపు దక్కుతోందని అన్నారు . డబుల్స్ అంశానికి నిధులతో పాటు ప్రోత్సాహం కూడా కొరవడిందని జ్వాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే డబుల్స్ విభాగం పట్ల యువతలో ఆసక్తి పెంపొందించలేరని స్పష్టం చేశారు. ఓ సింగిల్స్ షట్లర్ పది డాలర్లు సంపాదిస్తే, డబుల్స్ ప్లేయర్ కు దక్కుతోంది రెండు డాలర్లు మాత్రమేనని వివరించారు. తాము అమోఘరీతిలో గెలిచినా తమకు ఎయిర్ పోర్టులో ఎవరూ స్వాగతం పలకరని, అదే, ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన సింగిల్స్ ప్లేయర్ కు అపూర్వ స్వాగతం పలుకుతారని జ్వాల మండిపడ్డారు. కాగా, గత కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ స్వర్ణం సాధించిన జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. మలేసియా జోడీ చేతిలో జ్వాల అండ్ కో పరాజయంపాలైంది.

  • Loading...

More Telugu News