: కుక్ కెప్టెన్ గా కొనసాగాలని అతని తల్లి, భార్య తప్ప ఎవరూ కోరుకోవడంలేదు: బాయ్ కాట్
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పై మాజీ సారథి జెఫ్రీ బాయ్ కాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్ ఇంగ్లండ్ కెప్టెన్ గా కొనసాగాలని అతని తల్లి, భార్య తప్ప మరెవరూ కోరుకోవడంలేదని వ్యంగ్యోక్తి విసిరారు. ఇటీవల కాలంలో ఫామ్ లేక, పరుగులు రాక ఇక్కట్ల పాలవుతున్న కుక్ పై విమర్శల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో బాయ్ కాట్ మాట్లాడుతూ, ఆరు బలిష్టమైన గుర్రాలతో లాగితే కానీ కుక్ కెప్టెన్సీని వదిలి ఇవతలికి రాడని వ్యాఖ్యానించారు.