: కోడిపుంజు దాడిచేయడంతో పసిపాప మృతి


కోడిపుంజు దాడి చేయడంతో ఓ పసిపాప మృతి చెందింది. నల్లగొండ జిల్లా మునగోడు మండలం లక్ష్మిదేవిగూడేనికి చెందిన ఎనిమిది నెలల పసిపాప జాహ్నవిపై కోడిపుంజు గురువారం దాడి చేసింది. కోడిపుంజు దాడిలో జాహ్నవికి తీవ్రగాయాలయ్యాయి. జాహ్నవి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో హూటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. డాక్టర్లు జాహ్నవి ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా కృషి చేశారు... కానీ, ఫలితం దక్కలేదు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాహ్నవి తుదిశ్వాస విడిచింది. తల్లిదండ్రుల అజాగ్రత్త కారణంగానే కోడిపుంజు జాహ్నవిపై దాడి చేసిందని గ్రామస్థులు అంటున్నారు.

  • Loading...

More Telugu News