: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలి: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఆందోళన బాట పడతానంటున్నారు. సుప్తచేతనావస్థలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తీరుపై ఆయన మండపడ్డారు. అసెంబ్లీని వారంలోగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఆయన తీరుపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మండిపడుతున్నాయి. ఏడాదికోసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా కష్టమని... ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని ఎద్దేవా చేస్తున్నాయి.