: అనంతలో నేడూ, రేపూ చంద్రబాబు బిజీబిజీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు కదిరిలో రోడ్ షో నిర్వహిస్తారు. తన 'అనంత' పర్యటన సందర్భంగా బాబు పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శిస్తారు. కాగా, జిల్లాకు రానున్న బాబుకు పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందించాలని వామపక్ష నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు తలపెట్టిన అనంతపురం బంద్ ను వామపక్షాలు విరమించుకున్నాయి.

  • Loading...

More Telugu News