: స్వర్ణపతకం సాధించిన తెలుగు బిడ్డ
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగు బిడ్డ పారుపల్లి కశ్యప్ భరతమాత గర్వించేలా చేశాడు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో స్వర్ణపతకం సాధించాడు. సింగపూర్ కు చెందిన డెరెక్ వాంగ్ పై మూడు సెట్ల పోరులో 21-14, 11-21, 21-19 తేడాతో కశ్యప్ గెలుపొందాడు. 1982 తరువాత బ్యాడ్మింటన్ లో స్వర్ణపతకం సాధించిన ఏకైక ఆటగాడు పారుపల్లి కశ్యప్ కావడం విశేషం. కశ్యప్ సాధించిన పతకంతో భారత ఖాతాలో 15 స్వర్ణపతకాలు ఉన్నాయి.