: స్థానిక సంస్థలకు చురకలంటించిన వెంకయ్యనాయుడు
స్థానిక సంస్థలు మరింత బాధ్యతగా... పారదర్శకంగా పని చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను ఖర్చుచేయడమే తమ పనిగా చాలామంది మునిసిపల్ చైర్మన్ లు, కార్పొరేటర్లు, పంచాయతీ అధికారులు భావిస్తున్నారని ఆయన చురక అంటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో కూడా స్థానిక సంస్థలు ఏ మాత్రం పారదర్శకత లేకుండా ఖర్చు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డబ్బుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద పూర్తిగా ఆధారపడకుండా... నిధుల సేకరణపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలు పన్నులు సక్రమంగా వసూలు చేయడం... ఆ పన్నులను సక్రమంగా మళ్లీ ప్రజల సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడంలో మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన వ్యాఖ్యానించారు.