: కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం అదిరిపోయింది


కామన్వెల్త్ క్రీడలు గ్రేట్ బ్రిటన్లోని గ్లాస్గో నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్వీన్ ఎలిజబెత్-2 ఈ క్రీడా సంరంభాన్ని లాంఛనంగా ఆరంభించారు. సెల్టిక్ పార్క్ వేదికగా కళాకారుల సంగీత, నృత్య రూపకాలు వీక్షకులను అలరించాయి. వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్కాటిష్ గాయకులు రాడ్ స్టివార్ట్, సుసాన్ బోయల్ లు తమ గానమాధుర్యంతో అందరినీ రంజింపజేశారు. ఈసారి మార్చ్ పాస్ట్ లో భారత బృందం ముందుగా మైదానంలోకి రాగా, చివరగా ఆతిథ్య స్కాట్లాండ్ ప్రవేశించింది. 11 రోజుల పాటు జరగనున్న ఈ 20వ కామన్వెల్త్ క్రీడల్లో 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. 71 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రాణి మాట్లాడుతూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ క్రీడల్లో 14 అంశాల్లో పోటీపడనున్న భారత్ 215 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది.

  • Loading...

More Telugu News