: చందానగర్ లో పోలీసుల ముమ్మర తనిఖీలు
హైదరాబాద్ లోని చందానగర్ లో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దాదాపు 250 మంది పోలీసులు చందానగర్ పరిధిలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులపైకి కాల్పులు జరిపి, ఓ కానిస్టేబుల్ మరణానికి కారకులైన దొంగలు చందానగర్ పరిధిలోనే తలదాచుకున్నారన్న అనుమానంతోనే పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అర్థరాత్రి నుంచి కొనసాగుతున్న ఈ సోదాల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దాడుల కారణంగా స్థానికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.