: 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారం: చంద్రబాబు


తెలంగాణ రాష్ట్రంలో 2019 లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా తెలంగాణలో టీడీపీని ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన గ్రేటర్ పార్టీ (హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల) సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో టీడీపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ నేతలు విర్రవీగడం మంచిది కాదని... ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీ టీడీపీ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే టీ టీడీపీ నేతలకు కేంద్రంలో నామినేటెడ్ బోర్డుల్లో పదవులు కేటాయిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News