: భీకర గాలుల కారణంగానే తైవాన్ విమానం కూలిపోయిందా?


తైవాన్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అవుతుండగా... టైపూన్ సందర్భంగా ప్రచండమైన గాలులు వీయడం వల్లనే కూలిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మట్మో టైపూన్ ప్రభావంతో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే నేలకూలింది. దీంతో టైఫూన్ భీకర గాలుల కారణంగానే విమానం కూలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ లోని పెంఘ ద్వీపంలో ట్రాన్స్ ఆసియా విమానం కూలిపోయిన ప్రాంతంలో సహాయక చర్యల కోసం 200 మందితో కూడిన తైవాన్ బృందం బయల్దేరింది. వీరు సహాయక చర్యల్లో పాల్గొంటారని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విమానంలో 58 మంది ప్రయాణిస్తుండగా... 51 మంది మరణించినట్లు సమాచారం. మిగిలిన ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.

  • Loading...

More Telugu News