: రుణాల రీషెడ్యూల్ కు ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు: సీఎం చంద్రబాబు


రుణాల రీషెడ్యూల్ కు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోవడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీషెడ్యూల్ ఇబ్బందిగా మారిందని, సమయం మించి పోవడంతో ఆర్బీఐ 'నో' చెప్పిందనీ అన్నారు. ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వమించారు. రుణమాఫీ, అంటువ్యాధులు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి పలు అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా కుటుంబానికి రూ.1.5 లక్షల చొప్పున రుణమాఫీ చేద్దామని కలెక్టర్లకు చెప్పారు. రుణమాఫీపై రిజర్వు బ్యాంకు నుంచి ఇంకా కొన్ని మార్గదర్శకాలు రావాలని, బ్యాంకులకు ష్యూరిటీలు చెల్లిస్తామని, ఏదేమైనా రుణమాఫీ సాధిస్తామని బాబు చెప్పారు. ఇక కడప, అనంతపురం జిల్లాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీలు తయారుచేయాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మరోవైపు, వైద్య ఆరోగ్యశాఖపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకుని, ప్రజారోగ్యం విషయంలో మరింత శ్రద్ధ చూపాలని చెప్పారు.

  • Loading...

More Telugu News