: బ్లడ్ బ్యాంకుల వివరాలతో త్వరలో వెబ్ పోర్టల్


ఒకప్పుడు అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనేవారు. నేటి పరిస్థితుల్లో రక్తదానమే మిన్న అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సల సందర్భంగా ఎందరో సమయానికి రక్తం అందక మరణిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు రక్తదాన ప్రాముఖ్యతపై విశేష ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బ్లడ్ బ్యాంకుల వివరాలతో ఓ వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసేందుకు నిశ్చయించుకుంది. ఈ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వల వివరాలు, అందుబాటులో ఉన్న గ్రూపుల వివరాలు ఈ పోర్టల్ లో తెలుసుకోవచ్చు. ఈ దిశగా కార్యాచరణ మొదలైందని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సేవల డైరక్టర్ బిశ్వరంజన్ శత్పతి తెలిపారు.

  • Loading...

More Telugu News