: పది వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తాం: గంటా
రాష్ట్రంలో 10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేందుకు అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసి అవసరమైనంతమేర ఉపాధ్యాయులను నియమిస్తామని ఆయన వెల్లడించారు.