: సిమెంటు ధరలు తగ్గుతున్నాయ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సిమెంట్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో సిమెంట్ ధరలపై ప్రధానంగా చర్చ జరిగింది. సిమెంట్ బస్తాపై రూ.25 తగ్గించేందుకు సిమెంటు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ... సిమెంటు ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ధరల తగ్గింపు విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని వారు స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం దృష్టిలో ఉంచుకునే సిమెంటు ధరలను తగ్గించేందుకు ఒప్పుకున్నట్లు వారు తెలిపారు.