: కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి నాయిని
రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని మాజిద్ పూర్ లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. అనంతరం నాయిని మీడియాతో మాట్లాడుతూ... నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కానిస్టేబుల్ ఈశ్వర్ రావు, ఎస్ఐ వెంకటరెడ్డి ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.