: సాయినగర్ షిర్డీ-విశాఖ ఎక్స్ ప్రెస్ లో దొంగల హల్ చల్
సాయినగర్ షిర్డీ - విశాఖ ఎక్స్ ప్రెస్ లో శుక్రవారం అర్థరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను వారు తస్కరించారు. ఎస్-1, ఎస్-2, ఎస్-3తో పాటు ఎస్-5 బోగీలో ప్రయాణికుల మెడలో నుంచి బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారు. మహారాష్ట్రలోని పర్చూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దోపిడీని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపివేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్ స్టేషన్ లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.