: వికసించిన బ్రహ్మకమలం
గ్రేటర్ హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. భెల్ లో ఒక ఇంట్లో ఒకే కొమ్మకు పదుల సంఖ్యలో బ్రహ్మకమలాలు వికసించి నయనానందకరంగా కనిపించాయి. భెల్ ఎంఐజీ కాలనీ ఇంటినెంబరు 1092లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి పల్లంరాజు ఇంట పెరిగిన బ్రహ్మకమలం చెట్టుకు పుష్పాలు విరబూశాయి. అలాగే కూకట్ పల్లి, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ ఈ పువ్వులు సువాసనను వెదజల్లాయి.