: అండర్సన్, జడేజా వివాదంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ


అండర్సన్, జడేజా వివాదానికి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (ఐసీసీ) ముగింపు పలికింది. ఆరు గంటల విచారణ తర్వాత ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లిద్దరూ తప్పు చేయలేదని ఐసీసీ ప్రకటించింది. అలాగే, జడేజాపై ఫీజు కోత నిర్ణయాన్ని ఐసీసీ వెనక్కి తీసుకుంది. క్రికెట్ మైదానంలో అండర్సన్, జడేజా మధ్య మాటా మాటా పెరిగింది. అండర్సన్ జడేజాపై నోరు పారేసుకున్నాడు. దానికి జడేజా దీటుగా జవాబిచ్చాడు. దీంతో, మొదలైన వివాదంలో తొలుత జడేజాను తప్పుబట్టిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అయితే, దీనిపై బీసీసీఐ అప్పీలుకు వెళ్లింది. అంతే కాకుండా జరిగిన దాంట్లో అండర్సన్ దే తప్పు అని, అతడు అన్న మాటలకు జడేజా జవాబు ఇచ్చాడని బీసీసీఐ సాక్ష్యాలతో ఐసీసీ ముందుకెళ్లింది. దీంతో, ఈ వివాదంపై అందరి దృష్టి మరలింది. బీసీసీఐ వాదనతో అందరూ అండర్సన్ పై చర్య తీసుకుంటారని ఆశించారు. అయితే, అందుకు భిన్నంగా ఇప్పుడు ఐసీసీ అండర్సన్ ను వెనకేసుకొచ్చినట్లయింది. అంతేకాకుండా, దీంట్లో వారిద్దరి తప్పేమీ లేదని చెప్పటం మరో వివాదానికి దారితీస్తుందేమో!

  • Loading...

More Telugu News